ప్రభుత్వ స్కూళ్లలో 12వేల స్మార్ట్ క్లాసులు ప్రారంభం

ప్రభుత్వ స్కూళ్లలో 12వేల స్మార్ట్ క్లాసులు ప్రారంభం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 12,430  స్మార్ట్ క్లాసులు ప్రారంభించారు. 240 ప్రభుత్వం పాఠశాలల్లో స్మార్ట్ క్లాసుల నిర్వహణ జరగనుంది. దేశరాజధాని ఢిల్లీలోని రాజోక్రీలో జరిగిన  కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్.. ఈ విషయాన్ని తెలిపారు. ఢిల్లీ గవర్నమెంట్ ఏడేళ్లుగా ఏడు వేల క్లాసు రూంలను నిర్మించిందన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కలిపినా 20వేలకు మించి నిర్మించలేకపోయారని అన్నారు.

ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్య అందుకోవాలని బాబా సాహెబ్ అంబేద్కర్ కల కనేవారని.. దురదృష్టవశాత్తు 75ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో అతని కలను మిగిలిన ఏ రాష్ట్రం సాకారం చేయలేకపోయిందన్నారు కేజ్రీవాల్. కనీసం ఢిల్లీలోనైనా ఆయన కలను నెరవేర్చినందుకు నేను సంతోషంగా ఉన్నానని తెలిపారు. కొద్ది రోజులుగా దేశంలోని చాలా మంది నాయకులు కేజ్రీవాల్ టెర్రరిస్టు అంటున్నారని.. ఇప్పుడు టెర్రరిస్టే ఈ రోజు దేశం కోసం 12వేల 430 క్లాసు రూంలను అంకితం ఇస్తున్నాడని అన్నారు.

అంతేకాదు.. 537 కొత్త స్కూల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయని ఢిల్లీ గవర్నమెంట్ స్టేట్మెంట్ లో  తెలిపింది. ఆ క్లాస్ రూంలలో లైబ్రరీలు, మల్టీ పర్పస్ హాల్స్ లాంటివన్నీ ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తల కోసం..

మరో ఫార్మాట్కు సారథిగా రోహిత్