మరో ఫార్మాట్కు సారథిగా రోహిత్

మరో ఫార్మాట్కు సారథిగా రోహిత్

ముంబై: భారత టెస్టు జట్టు నూతన సారథిగా రోహిత్ శర్మ పేరును బీసీసీఐ ఖరారు చేసింది. త్వరలో శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్ నుంచి హిట్ మ్యాన్ ఫుల్ టైమ్ టెస్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపడతాడని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తెలిపారు. టెస్టు కెప్టెన్సీకి రోహిత్ చక్కగా సరిపోతాడని.. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. శ్రీలంకతో టెస్ట్, టీ20లకి బుమ్రాను వైస్ కెప్టెన్ గా ప్రకటించారు. 

పుజారా, రహానెకు దక్కని చోటు

లంకతో సిరీస్ లో సీనియర్లు ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానెలకు జట్టులో చోటు దక్కలేదు. కొంతకాలంగా వరుసగా వీరు వరుసగా విఫలమవుతుండటమే దీనికి కారణమని తెలుస్తోంది. టీమ్ లో కొత్తగా ప్రియాంక్ పాంచల్, కేఎస్ భరత్, సౌరభ్ కుమార్ కు సెలెక్టర్లు చోటు కల్పించారు. ఇకపోతే, ఇప్పటికే టీమిండియాకు లిమిటెడ్ ఓవర్ల కెప్టెన్ గా ఉన్న హిట్ మ్యాన్.. ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్ లోనూ జట్టును నడిపించేందుకు సిద్ధమవుతున్నాడు. 

మరిన్ని వార్తల కోసం:

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోట్లే

రెండు నెలల్లో టీఆర్ఎస్ కు లీడర్ ఉండడు

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ కు కేసీఆర్