రాజకీయంగా టీఆర్ఎస్ ఎప్పుడో ఓడిపోయింది

రాజకీయంగా టీఆర్ఎస్ ఎప్పుడో ఓడిపోయింది

నిజామాబాద్: దేశంలో మోడీ వ్యతిరేక శక్తులు మైనార్టీ ముసుగులో ఏకమవుతున్నాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. హిజాబ్ ఇస్లాంలో తప్పని.. సరేమీ కాదన్నారు. ఒకప్పుడు పాకిస్థాన్ ప్రధాని భుట్టో హిజాబ్ వేసుకోలేదన్నారు. ముస్లింలు ర్యాలీ చేస్తే అనుమతి ఇస్తారని.. హిందువులు చేస్తామంటే వద్దంటారని చెప్పారు. మక్కాకు వెళ్తే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని.. కానీ హిందువులకు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. 

‘నిజామాబాద్ జిల్లాలో కమలం వికసించింది. ఆపడం ఎవరి తరమూ కాదు. హైదరాబాద్ లో రామరాజ్యం స్థాపన వరకూ ఆగదు. ఇతరులు దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం మనం కూడా ఏదైనా చేయొచ్చు. ఇప్పటి నుంచి అదే చేస్తాం. రెండు నెలల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు మిగలరు. ఆ పార్టీలో పోటీ చేసే నాయకుడూ ఉండడు. అనవసరంగా హిందువులతో గొడవలు పెట్టుకోవద్దు. ఖిల్లా రామాయణం నిర్మించింది శివాజీనే. ఖిల్లా జైలులో దాశరథి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. రైతులకు టీఆర్ఎస్ చేసిందేమీ లేదు. పసుపు రైతులు వర్షాలకు పంట నష్టం అయ్యిందని వాపోతున్నారు. ఆ విషయం మంత్రికి తెలియదా? డబుల్ బెడ్ రూమ్ లు లేవు. దళితుల కోసం కేసీఆర్ సర్కారు ఏమీ చేయలేదు. రాజకీయంగా టీఆర్ఎస్ ఎప్పుడో ఓడిపోయింది’ అని అర్వింద్ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ కు కేసీఆర్

అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డ్ 

75 ఏండ్లయినా అంబేడ్కర్ కలలు నెరవేరట్లే