మొహల్లా క్లినిక్స్​పై కేజ్రీవాల్ ఆర్డర్​, ఈడీ కస్టడీ నుంచే రెండోసారి ఆదేశాలు

మొహల్లా క్లినిక్స్​పై కేజ్రీవాల్ ఆర్డర్​, ఈడీ కస్టడీ నుంచే రెండోసారి ఆదేశాలు

న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్​లో మనీలాండరింగ్​కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఈడీ కస్టడీ నుంచి మంగళవారం రెండో ఆర్డర్ రిలీజ్ చేశారు. మొహల్లా క్లినిక్స్​లో సరిపడా ఫ్రీ మెడిసిన్స్ అందుబాటులో ఉంచాల్సిందిగా ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్​ను ఆయన ఆదేశించారు. ఎక్కడా మందుల కొరత రాకుండా చూడాలని కోరారు. అదేవిధంగా, డయాగ్నోస్టిక్ టెస్టులు కూడా నిరాటంకంగా కొనసాగించాల్సిందిగా సూచించారు. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్.. ఇప్పటికే ఢిల్లీలో నీటి కొరత రాకుండా చూసుకోవాలని ఫస్ట్ ఆర్డర్ రిలీజ్ చేశారు. 

తాము కంప్యూటర్, పేపర్లు ఇవ్వలేదని, కస్టడీలో ఉన్నప్పుడు ఆర్డర్ ఎలా రిలీజ్ చేశారన్నదానిపై ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రెండో ఆర్డర్ రిలీజ్ చేయడం చర్చనీయాంశమైంది. ఫస్ట్ ఆర్డర్ విషయంలో ఆప్ మంత్రి ఆతిశీని విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. సెకండ్ ఆర్డర్ రిలీజ్ 
చేయడాన్ని అధికారులు సీరియస్​గా తీసుకున్నారు.