
ఉత్తరాధి రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. యమున నదిలో నీటిమట్టం 203 మీటర్లకు చేరుకుంది. ఫలితంగా హర్యాణా ప్రభుత్వం హతినికుండ్ జలాశయం నుంచి 8.14 లక్షల క్యూసెక్ ల నీటిని కిందకు విడిచిపెట్టింది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఢిల్లీ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం హెచ్చరించింది. సహాయక చర్యల కోసం సైన్యం సిద్ధంగా ఉండాలని కోరింది. మరోవైపు అధికారులతో కలిసి వరదలపై సమీక్షించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.