కూల్చివేతలు ఆపండి

 కూల్చివేతలు ఆపండి

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణ నిర్మాణాల కూల్చివేతపై అక్కడి సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ అధికారంలో ఉన్న మున్సిపాలిటీల్లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. బుల్డోజర్లతో కూల్చి వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ... అక్రమ కట్టడాలంటూ ఇలా కూల్చుకుంటూ పోతే ఢిల్లీలో ఇళ్లు మిగలవన్నారు. డిల్లీ నగరంలో 80 శాతానికి పైగా ఇళ్లు ఎలాంటి ప్రణాళిక లేకుండా నిర్మించినవేనని... అలాంటప్పుడు ఇలా కూల్చుకుంటూ పోతే మొత్తం నగరం మొత్తం నేలమట్టమయ్యే ప్రమావముందన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో షాపులను, ఇళ్లను కూల్చడం సరికాదన్నారు. ఇలాగే కొనసాగిదే మొత్తం 63 లక్షల ఇళ్లు ధ్వంసం అవుతాయని.... దేశంలో ఇంతకంటే పెద్ద విధ్వంసం మరొకటి ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్న ఈ విధ్వంసాన్ని ఎదుర్కోడానికి ప్రజలు ముందుకు రావాలని, అవసరమైతే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తల కోసం...

ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి టోక్యో పర్యటన

మే 28న స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు