కేజ్రీవాల్ పిటిషన్ పై మీరేమంటరు?

కేజ్రీవాల్ పిటిషన్ పై మీరేమంటరు?

న్యూఢిల్లీ :  లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ నేతృత్వంలోని బెంచ్ బుధవా రం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్ పిటిషన్​పై తమ వైఖరేంటో చెప్పా లని ఈడీని హైకోర్టు ఆదేశించింది. దీనిపై రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పింది. అంతకుముందు కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వకేట్ ఏఎం సింఘ్వీ వాదిస్తూ.. మనీలాండరింగ్ చట్ట పరిధిలోకి ఒక రాజకీయ పార్టీ వస్తుందా? లేదా? అన్న ప్రశ్నను లేవనెత్తారు. ‘ఎన్నికల వేళ కేజ్రీవాల్​ను అరెస్టు చేయాలనే దురుద్దేశం తోనే ఈడీ సమన్లు జారీ చేస్తున్నది. ఆయనకు రక్షణ కల్పించాలి” అని సింఘ్వీ కోర్టును కోరారు.