కోర్టు మెట్లెక్కిన బిగ్ బీ ఫ్యామిలీ.. గూగుల్, యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులు

కోర్టు మెట్లెక్కిన బిగ్ బీ ఫ్యామిలీ.. గూగుల్, యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులు

బాలీవుడ్ హీరో, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు, ప్రముఖ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ కు సంబంధించిన ఫేక్ న్యూస్ ను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు యూట్యూబ్ ను ఆదేశించింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి తప్పుడు వార్తలను షేర్ చేయరాదని కోర్టు తెలిపింది. అంతకు ముందు తమ కుమార్తె ఆరోగ్యంపై ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి, యూట్యూబ్ లో ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలతో ఐశ్వర్య రాయ్ బచ్చన్ , అభిషేక్ బచ్చన్ లు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన కోర్టు.. తాజాగా గూగుల్ ఎల్ఎల్సీతో సహా అన్ని యూట్యూబ్ ఛానెళ్లకు సమన్లు జారీ చేసింది.

అంతకుముందు తన కూతురు మైనర్ అని.. ఆమె  ఆరోగ్యం గురించి నిరాధారమైన ప్రచారం చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని అభిషేక్ దంపతులు పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ వీడియోలన్నింటిని డీ లిస్ట్ లేదా డియాక్టివేట్ చేసేలా ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ క్రమంలోనే గూగుల్ తో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన గ్రీవెన్స్ సెల్ లను కేసులో పార్టీలుగా చేర్చింది.

ఈ తరహా ట్రోలింగ్స్పై ఆరాధ్య తండ్రి అభిషేక్ బచ్చన్ చాలాసార్లు సీరియస్ అయ్యారు. 11ఏండ్ల తమ పాపను టార్గెట్ చేయడం సరికాదని చెప్పారు. ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోవడంతో.. ఇటీవల ఆ కుటుంబం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.