Kejriwal arrest Plea:  కేజ్రీవాల్ కేసులో..ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు 

Kejriwal arrest Plea:  కేజ్రీవాల్ కేసులో..ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు 

న్యూఢిల్లీ: అర్వింద్ కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నోటీసులు ఇచ్చింది. మంగళవారం (జూలై2,2024) కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ మీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం.. ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ తర్వాత రెండు రోజుల్లో రిజయిండర్ దాఖలుచేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 17, 2024కు వాయిదా వేసింది.