
ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు అన్ని జలమయం అయ్యియి. ఇండ్లు, అపార్ట్మెంట్లోకి నీర్లు చేరాయి. ఆదివారం ఉదయం రావుస్ IAS స్టడీ సర్కిల్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న ముగ్గురు విద్యార్థులు నీట మునిగి చనిపోయారు. వారిలో ఒకరు తెలంగాణ యువతి. ఓల్డ్ రాజిందర్ నగర్ ప్రాంతంలోని కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి 7గంటలకు గ్రౌండ్ ఫ్లోర్ లో సివిల్స్ అభ్యర్థులు చిక్కుకున్నారు.
రెస్క్యూ టీంలు 13 మందిని కాపాడగలిగారు. బేస్మెంట్ లో ఇంకా 7అడుగుల లోతు వరద ఉందని స్థానికులు చెప్తున్నారు. కోచింగ్ సెంటర్ ఓనర్, కోఆర్డినేటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుల్లో ఒకరు తెలంగాణకు చెందిన తన్యా సోని, మరోఇద్దరు యువకులు మధ్యప్రదేశ్, కేరళకు చెందిన వారిగా గుర్తించారు. డ్రైనేజ్ క్లిన్ చేయకపోవడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ బేస్‌మెంట్లలో నిర్వహిస్తున్న అన్ని కోచింగ్ సెంటర్లపై చర్య తీసుకోవాలని ఆదేశించారు. పలువురు రాజకీయ నాయకులు ఈ విషాదంపై స్పందించారు. సివిల్స్ అభ్యర్థులు పెద్దఎత్తున రోడ్లపై నిరసనలు ప్రదర్శిస్తున్నారు.