అగ్గిపెట్టె ఇవ్వలేదని పొడిచి చంపిండు..ఢిల్లీలోని కేశవ్ పురంలో దారుణం

అగ్గిపెట్టె ఇవ్వలేదని పొడిచి చంపిండు..ఢిల్లీలోని కేశవ్ పురంలో దారుణం

న్యూఢిల్లీ: సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపుల్ల ఇవ్వలేదన్న చిన్న కారణంగా జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. నార్త్‌‌వెస్ట్ ఢిల్లీలోని కేశవ్‌‌పురంలో  వైన్ షాప్ వద్ద ఉన్న భవానీ, ఆశా రామ్‌‌ల వద్దకు కొందరు వ్యక్తులు వచ్చి సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె అడిగారు. తమ వద్ద లేదని చెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన నిందితులు వారిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. భవానీని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారు.