కార్డ్ లో పైసలు ఖల్లాస్ ! ఖతర్నాక్ దొంగలు అరెస్ట్

కార్డ్ లో పైసలు ఖల్లాస్ ! ఖతర్నాక్ దొంగలు అరెస్ట్

వాళ్లంతా మాయగాళ్లు. ఏటీఎం కార్డ్ దొరికినా.. కంటపడినా… అందులోని డబ్బంతా మాయం చేస్తారు. ఏటీఎం కార్డ్ ఖాతాదారుడి జేబులోనే ఉంటుంది. కానీ… అందులోంచి డబ్బులు డ్రా అయినట్టు ఫోన్ కు మెసేజ్ వస్తుంది. ఇది చూసిన వినియోగదారుడికి దిమ్మతిరుగుతుంది. ఇలాంటి ఏటీఎ కార్డ్ నేరాలకు పాల్పడే దేశ ముదురు ఫ్రాడ్ గ్యాంగ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ATM క్లోనింగ్ గ్యాంగ్ ముఠాను పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. ముఠాలోని ఈ నలుగురూ బాగా చదువుకున్నోళ్లే. కానీ.. తెలివి తేటలను సైడ్ ట్రాక్ ఎక్కించి… ఈజీ మనీకి అలవాటైపోయి.. జనం సొమ్మును దొబ్బుకు తింటున్నారు. ATM లకు స్కిమ్మింగ్ మెషీన్లు అమర్చి… బ్యాంక్ ఖాతాదారుడి ఏటీఎం కార్డ్ వివరాలు దొంగతనంగా సంపాదించి.. క్లోనింగ్ కార్డులు తయారుచేసి.. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుంటారు. ఈ మాయగాళ్లను పట్టుకునేందుకు ఢిల్లీ సహా.. అన్ని రాష్ట్రాల పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

క్లోనింగ్ కోసం ఈ ముఠా వాడే సరంజామాను పోలీసులు మీడియాకు చూపించారు. స్కిమ్మర్లను వీరే తయారుచేసి.. జన సంచారం , నిఘా ఎక్కువగా లేని ఏటీఎంలలో అమర్చుతారు. వినియోగదారుల డేటాను రికార్డ్ చేసి.. అమర్చిన పరికరాలను తొలగించి.. డేటా సహాయంతో.. క్లోనింగ్ చేస్తారు. ఈ మధ్య ఇలాంటి నేరాలు బాగా పెరిగిపోవడంతో.. పోలీసులు బ్యాంకర్లకు ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు.