ఢిల్లీలో డేంజర్ బెల్స్.. బయటకు రావాలంటే జంకుతున్న జనం

ఢిల్లీలో డేంజర్ బెల్స్.. బయటకు రావాలంటే జంకుతున్న జనం

దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఢిల్లీ మహానగరంలోని పలు ప్రాంతాల్లో... ఎయిర్ క్వాలిటీ పూర్ కేటగిరీలో రికార్డు అయింది. వాయు కాలుష్యంతోపాటు దట్టమైన పొగమంచుతో..ఢిల్లీలోని ప్రధాన రోడ్లు చీకటిని తలపిస్తున్నాయి. 

ALSO READ : ఢిల్లీలో బాంబు పేలుడు 

ఉదయం పూట రోడ్లపైకి వెళ్లాలంటే ఢిల్లీవాసులు జంకుతున్నారు. కన్నట్ ప్లేస్, రెడ్ పోర్టు, ఢిల్లీగేట్ తోపాటు అక్షర్ దామ్ ఏరియాలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఆగ్రాలోని తాజ్ మహల్  దగ్గర ఎయిర్ క్వాలిటీ.. మోడరేట్ కేటగిరీలో ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది. గ్రేటర్ ఢిల్లీ పరిధిలో అత్యవసర పనులుంటే తప్ప వేకువజాము జనం బయటకు రావటంలేదు.