సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన ఢిల్లీ ప్రజలు..మళ్లీ పెరిగిన ఎయిర్ పొల్యూషన్..

సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన ఢిల్లీ ప్రజలు..మళ్లీ పెరిగిన ఎయిర్ పొల్యూషన్..

సుప్రీకోర్టు నిషేధ ఉత్తర్వును ఉల్లంఘించి, దీపావళి రాత్రి ప్రజలు క్రాకర్లు పేల్చడంతో సోమవారం ఉదయం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దట్టమైన విషపూరిత పొగమంచుతో ఢిల్లీ లోని అన్ని ప్రాంతాలు కప్పబడ్డాయి. 

ఢిల్లీ అంతటా ఉన్న దృశ్యాలు రోడ్లపై దట్టమైన పొగమంచు కప్పి పరిసర ప్రాంతాలు కనిపిచడం లేదు. దీపావళికి ముందు ఢిల్లీలో AQI మరింత దిగజారింది. దీంతో బాణసంచా , నిషేధిత రసాయనాల వాడకాన్ని నిషేధించి సుప్రీంకోర్టు.. కేవలం ఢిల్లీలోనే కాదు దేశ మొత్తం వర్తిస్తుందని స్పష్టం చేసింది. 

ఆదివారం ఉదయం ఢిల్లీ ఎనిమిదేళ్లలో దీపావళి రోజున అత్యుత్తమ గాలి నాణ్యతను చూసింది. క్లియర్ స్కైస్ , విస్తారమైన సూర్యరశ్మికి ఢిల్లీ వాసులు మేల్కొన్నారు.. నగరం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఉదయం 7 గంటలకు 202 గా నమోదు అయింది. గడిచిన మూడు వారాల్లో ఇది అత్యుత్తమం. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఆదివారం సాయంత్రం దీపావళి క్రాకర్స్ పేల్చడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. 

Also Read :- రిషి సునాక్‌కు మోదీ స్పెషల్ గిఫ్ట్‌