ఢిల్లీ – పుణె విమానానికి బాంబు బెదిరింపు

ఢిల్లీ – పుణె విమానానికి బాంబు బెదిరింపు

ఢిల్లీ నుంచి పుణె వెళ్తున్న విమానానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  విస్తారా విమానానికి చెందిన జీఎంఆర్​ కాల్​సెంటర్​కు ఆగస్టు 18న గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్​ చేశారు. 

ఫ్లైట్​లో బాంబు పెట్టామని బెదిరించారు. అధికారులు వెంటనే స్పందించి విమానం ఎగరకముందే తనిఖీలు నిర్వహించారు. చివరికి అది ఫేక్​కాల్​ అని తేలడంతో విమానం ఎగరడానికి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు. తనిఖీల సందర్భంగా జరిగిన ఆలస్యం పట్ల ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

వారిని శాంతింపజేయడానికి అధికారులు ప్రయత్నించారు. ఉదయం 7.30 కి బెదిరింపు కాల్​వచ్చినట్లు ఉన్నతాధికారులు ధృవీకరించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు వివరించారు.  బెదిరింపులకు పాల్పడిన వారి వివరాలు కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.