న్యూఇయర్ వేడుకలకు సిద్ధమైన ఢిల్లీ

న్యూఇయర్ వేడుకలకు సిద్ధమైన ఢిల్లీ

ఢిల్లీలో ఎటూ చూసిన న్యూఇయర్ జోష్ కనిపిస్తోంది. న్యూఇయర్ సందర్భంగా ప్రధాన మార్కెట్లు, టూరిస్ట్ ప్లేసులు, షాపింగ్ మాల్స్లో సందడి నెలకొంది. ఇండియా గేట్ దగ్గర సెలబ్రేషన్స్ చేసుకునేందుకు టూరిస్టులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. దీంతో ఇండియా గేటు దగ్గర సందడి కనిపిస్తోంది. 

కర్తవ్యపథ్ రోడ్డు మొత్తం టూరిస్టులతో నిండిపోయింది. న్యూఇయర్ సందర్భంగా ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ నింబధనలను విధించారు. డిసెంబర్ 31 రాత్రి 8 నుంచి రూల్స్ పాటించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. న్యూఇయర్ వేడుకలతో ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 18 వేల మంది పోలీసులు గస్తీ కాస్తున్నారు. 125 డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం మహిళ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.