G20 సమ్మిట్.. ఢిల్లీలో హైస్పీడ్ 5G సేవలు.. ఫ్రీ WiFi

G20 సమ్మిట్.. ఢిల్లీలో హైస్పీడ్ 5G సేవలు.. ఫ్రీ WiFi

సెప్టెంబర్ 9 నుంచి రెండు రోజుల పాటు జరగనున్న G20 సమావేశాలకు దేశ రాజధాని ఢిల్లీ నగరం ముస్తాబైంది. సెప్టెంబరు 9 నుంచి ప్రారంభమయ్యే రెండు రోజుల G-20 సమ్మిట్‌లో 20 సభ్య దేశాలతో సహా 40 దేశాల నుంచి నాయకులు, ప్రతినిధులు పాల్గొననున్నారు.  హైఫ్రొఫైల్ ఈవెంట్కు వచ్చే అతిథులకు భద్రత పటిష్టం చేశారు. ప్రగతి మైదాన్‌లోని అత్యాధునిక భారత మండపం కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. 

అయితే G20 శిఖరాగ్ర సమావేశానికి ముందు ఢిల్లీలో 5G నెట్‌వర్క్ ఊపందుకుంది. సమ్మిట్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగదారుల కనెక్టివిటీని పెంచునున్నారు. G20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఢిల్లీకి వచ్చే అతిథులకు  సెల్ ఫోన్ వినియోగంలో ఎటువంటి ఆటంకం 5 జి సేవలను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.  

ALSO READ :మన దేశం పేరు మారిపోయింది : ప్రెసిడెంట్ ఆఫ్ భారత్.. పార్లమెంట్ లో బిల్లు రాబోతున్నదా..?

ఇందుకోసం 5వేల 718 5జి బేస్ ట్రాన్స్ సీవర్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటితో కలుపుకుంటే ప్రస్తుతం ఢిల్లీ నగరంలో మొత్తం 10వేల 662 బీటీఎస్ లు అందుబాటులో ఉన్నాయి. ఇవి హైస్పీడ్ 5జి సేవలను అందించనున్నాయి. అంతేకాకుండా ఢిల్లీలో G20 సమ్మిట్ వేదిక ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం కాంప్లెక్స్ అంతటా ఉచిత WIFI సేవలు అందుబాటులో ఉన్నాయి.