శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు.. ఢిల్లీ ద్వారక ఇస్కాన్ దేవాలయంలో మెటావర్స్ ఎక్స్ పీరియెన్స్

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు.. ఢిల్లీ ద్వారక ఇస్కాన్ దేవాలయంలో మెటావర్స్ ఎక్స్ పీరియెన్స్

న్యూఢిల్లీలోని ఇస్కాన్ ద్వారక ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మెటావర్స్ ఎక్స్ పీరియన్స్ పేరుతో ఆన్ లైన్ దర్శనం, పూజా సేవలను ప్రారంభించనున్నారు. ఈ డిజిటల్ విధానంలో దేవతలను దర్శనం చేసుకోవచ్చు...హారతులు ఇవ్వొచ్చు.. ప్రత్యక్షంగా గుడికి వచ్చి అన్ని కార్యక్రమాలు నిర్వహించిన అనుభూతిని భక్తలు పొందుతారని నిర్వాహకులు చెబుతున్నారు. 

ఈ మెటావర్స్ లాంచ్ ప్రాముఖ్యతను నిర్వహాకులు శ్రీ శ్రీ గౌర్ ప్రభు ఇలా వివరించారు. "ఇస్కాన్ ద్వారా మెటావర్స్ ప్రయోగం మొదటిది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను దైవ దర్శనం సులభతరం చేయడానికి మేము దీనిని ప్రారంభించాం. వారు మన దేవతలను దర్శనం చేసుకోవచ్చు. ఈ డిజిటల్ విధానంలో హారతులు ఇవ్వొచ్చు.. పూజలు చేయొచ్చు.. ఇలా ఆలయంలో చేసే అన్ని కార్యక్రమాలు చేయొచ్చని’’ గౌర్ ప్రభు  అన్నారు.. ‘‘ఇది వారికి ఒక రకమైన వర్చువల్ రియాలిటీ. వారు గుడికి వచ్చినట్లుగా అనుభూతి చెందుతారు, అనుభవిస్తారు." అని తెలిపారు. 

మెటావర్స్ ఎక్స్ పీరియెన్స్ తో పాటు రెండు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న శ్రీ శ్రీ రుక్మిణి ద్వారకాధీష్ ఆలయం.. పౌష్టికాహారం పంపిణీ.. కౌన్సెలింగ్ సేవలు, యువతకు విలువ ఆధారిత విద్య,  ధ్యాన మందిరంతో సహా పలు కార్యక్రమాలను ఇస్కాన్ ద్వారక ఆలయం  అందిస్తోంది.