50 నిమిషాల్లో 40 కిలోల వరకు మెడిసిన్ పంపిణీ

50 నిమిషాల్లో 40 కిలోల వరకు మెడిసిన్ పంపిణీ

ఎమర్జెన్సీ టైమ్లో పేషెంట్లకు మెడిసిన్ సప్లై చాలా కష్టం. మందులు అందుబాటలో ఉన్నా..... మారుమూల ప్రాంతంలో వాటిని అందించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ట్రాన్స్ ఫోర్ట్ ఫెసిలిటీ ఉంటే ఓకే.. లేకుంటే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం. డ్రోన్లతో మెడిసిన్ సప్లై ఓ అవకాశంగా మారింది. ఇదే కాన్సెప్ట్ తో నిజామాబాద్ జిల్లాకు చెందిన వంశీ డ్రోన్ తయారీ చేశారు. ఈ డ్రోన్లతో 200 కిలో మీటర్ల వరకు మందులు పంపించవచ్చు. 50 నిమిషాల్లో 40 కిలోల వరకు మెడిసిన్ పంపిణీ చేయవచ్చంటున్నారు స్టార్టప్ నిర్వాహకులు.

ఏజెన్సీ ఏరియాలో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. వర్షకాలంలో ఈ  పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. విషజ్వరాలు, డయేరియా బారిన పడుతుంటారు. వీళ్లకు హాస్పిటల్స్ అందుబాటులో ఉండవు. సరైన ట్రాన్స్ పోర్ట్ ఉండదు. వైద్య సిబ్బంది ఏజెన్సీ ఏరియాలకు వెళ్లినా... అవసరమైన మెడిసిన్ ఉండకపోవచ్చు. ఈ టైమ్ లోనే డ్రోన్లను ఉపయోగించుకోవచ్చు. వైద్యసిబ్బంది కోరిన మందుల్ని.....అర్జెంట్గా డ్రోన్లతో పంపించవచ్చు.  ఏటా పెద్ద సంఖ్యలో ఆదివాసీ, గిరిజనులు విష జ్వరాలు, డయేరియాతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సేవలు మరింత అందుబాటులోకి వస్తే గిరిజనుల ప్రాణాల కాపాడవచ్చు.

కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న యువతకు స్టార్టప్ ఇండియా పథకం ద్వారా కేంద్రం ఆర్థిక సహాయం చేస్తోందని ఎంపీ అర్వింద్ అన్నారు. డ్రోన్లతో మందులు పంపిణీ చేయాలన్న ఆలోచన గొప్పదన్నారు. మెడ్ కాస్ట్ సంస్థ ద్వారా డ్రోన్ల సహాయంతో మెడిసిన్ పంపిణీ చేస్తామని చెప్పగానే, కేంద్రం వంశీకి 7 లక్షల రూపాయలు మంజూరు చేసిందని ఎంపీ తెలిపారు.