పెద్ద ఇండ్లకే గిరాకీ

పెద్ద ఇండ్లకే గిరాకీ

హైదరాబాద్, వెలుగు: ఇల్లు ఇరుకుగా కాకుండా విశాలంగా ఉండాలనే చాలా మంది చూస్తున్నారు. కరోనాకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇలా భావిస్తున్న వారి శాతం పెరుగుతుంది. కొత్తగా ఇండ్లు తీసుకునేవారు లగ్జరీగా ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే టూ బీహెచ్‌‌‌‌కే, త్రీ బీహెచ్‌‌‌‌కే తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇండ్లకు డిమాండ్ పెరుగుతున్నది. నగరంలోనూ నిర్మాణాలు జరుగుతున్నాయి. కొత్తగా ఇళ్లు తీసుకునేందుకు వెతుకుతున్న వాళ్లు ఎక్కువవుతున్నారు. అయితే మునుపటిలా కాకుండా స్పేషియస్ గా ఉండాలని తమకు నచ్చిన విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఈరకంగా తీసుకుంటున్నవారు ఆరు నుంచి పది శాతానికి పెరిగారని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్వహించిన సర్వేలో తేలింది. రియల్ ఎస్టేట్ కంపెనీ అనారాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ఈ ఏడాది ‘కన్స్యూమర్ సెంటిమెంట్ రిపోర్ట్ హెచ్‌‌‌‌1’ పేరుతో చెన్నై, ఢిల్లీ, బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ నగరాల్లో సర్వే చేసింది. 5,500 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ మెయిల్ క్యాంపెయిన్, వెబ్‌‌‌‌ లింక్‌‌‌‌, మెసేజ్‌‌‌‌ల ద్వారా కస్టమర్ల నుంచి ఫీడ్ బ్యాక్  తీసుకున్నారు. త్రీ బీహెచ్‌‌‌‌కేలకు 44 శాతం, టూ బీహెచ్‌‌‌‌లకు 38 శాతం డిమాండ్ ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం హైదరాబాద్ సిటీలో త్రీ బీహెచ్‌‌‌‌కే కంటే కూడా టూబీహెచ్‌‌‌‌కే తీసుకునేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. సిటీలో టూ బీహెచ్‌‌‌‌కే కి డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. సిటీలో ఇండ్లు కొనాలనుకునే వారిలో 49 శాతం మంది టూ బీహెచ్‌‌‌‌కే కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక బెంగుళూరులో త్రీ బీహెచ్‌‌‌‌కే కి 51 శాతం, చెన్నైలో48 శాతం డిమాండ్ ఉండగా, ముంబై లో త్రీ బీహెచ్‌‌‌‌కే కి 37 శాతం, టూ బీహెచ్‌‌‌‌కే కి 40 శాతం డిమాండ్ ఉందని సర్వే వెల్లడించింది. అయితే ఢిల్లీలో టూ బీహెచ్‌‌‌‌కేకి 42 శాతం, త్రీబీహెచ్‌‌‌‌కే కి 45 శాతం మంది మొగ్గు చూపించినట్లు తెలిపింది.

కొత్త లాంచ్‌‌‌‌లకు డిమాండ్
కోటిన్నర కంటే ఎక్కువ ధరున్న లగ్జరీ సెగ్మెంట్ ఇళ్లను కోరుకునేవారు పెరిగారు. స్పేషియస్ గా ఉండాలని కోరుకుంటున్నారు. జనవరి నుంచి జూన్ వరకు ఈ సర్వే నిర్వహించాం. డిమాండ్ పెరగడంతో కొత్త లాంచ్ లకు కూడా డిమాండ్ పెరుగుతుంది. 
-అనూజ్ పూరి, ఫౌండర్, చైర్మన్ అనరాక్ గ్రూప్

2బీహెచ్‌‌‌‌కే తీసుకుందామని సొంత ఇల్లు తీసుకోవాలని చూస్తున్నాం. అందులో భాగంగా ఎక్కువగా స్పేస్ ఉండేలా తీసుకోవాలని అనుకుంటున్నాం. ప్రైజ్ కూడా రీజనబుల్ గా ఉండాలని వెతుకుతున్నాం. 
- శ్రీనివాస్, కొండాపూర్