పట్టా మార్పిడికి రూ. 4500, స్మార్ట్​ఫోన్​ అడిగిండు

పట్టా మార్పిడికి రూ. 4500, స్మార్ట్​ఫోన్​ అడిగిండు

లింగంపేట, వెలుగు: పట్టా మార్పిడికి లంచం  తీసుకుంటుండగా ఆర్ఐను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రవికుమార్ వివరాల ప్రకారం… కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని కొర్పొల్​గ్రామానికి చెందిన ఉస్మాన్, నూరోద్దిన్, సమ్మియోద్దిన్​1972లో  నాగారం గ్రామ శివారులో 17 ఎకరాల 32 గుంటల భూమిని కొనుగోలు చేశారు. 2016లో రెవెన్యూ ఆఫీసర్లు సమగ్ర భూ ప్రక్షాళనలో 128 సర్వే నంబర్​లోని 1.10 గుంటల భూమిని లింగంపేట గ్రామానికి చెందిన సంతోష్​రెడ్డి అనే వ్యక్తి పేరిట రెవెన్యూ ఆఫీసర్లు పట్టా అందించారు. విషయం తెలుసుకున్న ఉస్మాన్​ కుమారుడు మహ్మద్​బషీరోద్దిన్​అలియాస్​సలీం తమ భూమిని అతని పేరిట ఎలా పట్టా చేస్తారని రెవెన్యూ ఆఫీసర్లను అడుగగా తమకు తెలియదంటే తమకు తెలియదని అన్నారు.

ఈ క్రమంలో సంతోష్​రెడ్డి ఆ భూమిని ఐలాపూర్​ గ్రామానికి చెందిన బెజుగం దేవేందర్​అనే వ్యక్తికి విక్రయించాడు. దీంతో సలీం పోలీసులను ఆశ్రయించాడు. చివరకు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా  రూ.1.5 లక్షలు దేవేందర్​కు చెల్లించి భూమిని పట్టా చేయించుకోవాలని నిర్ణయించారు. సలీం పెద్దల నిర్ణయం ప్రకారం డబ్బులు చెల్లించి దేవేందర్​నుంచి భూమిని రిజిస్ట్రేషన్​ చేయించుకున్నాడు. ఆ భూమిని తన పేరు మీద పట్టా మార్పిడి చేయాలని లింగంపేట ఆర్​ఐ ​సుభాశ్​ను కోరగా రూ.4500, స్మార్టు ఫోన్​ ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. బాధితుడు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్​ ఆఫీస్ ​ఆవరణలో బుధవారం రూ. 3 వేలు, ఫోన్​తీసుకుంటున్న ఆర్ఐ సుభాశ్​ను ఏసీబీ ఆఫీసర్లు పథకం ప్రకారం రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

see also: వైరస్ సోకిన ఆ ఇద్దరిని కలిసిందెవరు?

షేక్ హ్యాండ్ వద్దు .. నమస్తే ముద్దు