వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్​లైన్​ క్లాసులతో డేటాకు డిమాండ్​

వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్​లైన్​ క్లాసులతో డేటాకు డిమాండ్​
  • ఇంటర్నెట్ డేటాకు డిమాండ్​
  • వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్​లైన్​ క్లాసులే కారణం
  • రోజూ వేలల్లో కొత్త కనెక్షన్లు
  • సిటీలో 30 నుంచి 40 శాతం పెరిగిన వినియోగదారులు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్నెట్ డేటాకి డిమాండ్ పెరిగింది. అకడమిక్ ఇయర్ క్లాసులు ఆన్​లైన్ కావడం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల కారణంగా కస్టమర్లు ఎక్కువయ్యారు. 30 నుంచి 40 శాతం కొత్తగా కనెక్షన్లు తీసుకుంటున్నారని ఇంటర్నెట్ కనెక్షన్స్ సెంటర్ల జోన్ మేనేజర్లు చెప్తున్నారు. అన్ లిమిటెడ్ డేటా ప్లాన్ పైనే ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారని అంటున్నారు. కరోనా కంటే ముందు వరకు మొబైల్ డేటానే అందరికి సరిపోయింది.  ప్రస్తుతం మొత్తం ఆన్​లైన్​ కావడంతో ఎక్స్ ట్రా డేటా కావాల్సి వస్తోంది. దీంతో వైఫై కనెక్షన్లు తీసుకుంటున్నారు. కొవిడ్ కంటే ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇంటర్నెట్ యూసేజ్, కొత్త కనెక్షన్లు తీసుకునేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తుండగా బ్రాడ్ బ్యాండ్​కంపెనీలు అందుకు అనుగుణంగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. 

ఎరిక్సన్ సర్వే ప్రకారం చూస్తే

ఎరిక్సన్ మొబిలిటీ – 2021 సర్వే రిపోర్ట్  ప్రకారం దేశవ్యాప్తంగా 2020 నాటికి 4జీ సబ్ స్క్రిప్షన్స్ తీసుకున్న వారు 680 మిలియన్లు ఉంటే, 2026 నాటికి ఆ సంఖ్య 40 శాతం అంటే 830 మిలియన్లు పెరుగుతుందని అంచనా ఉన్నట్లు సర్వేలో తెలిపింది. మెట్రో, మెగా సిటీస్​లో హోమ్ ఇంటర్నెట్ కనెక్షన్లలో 4జీ ఎక్కువగా వినియోగించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు పేర్కొంది.