ఇండియా నిర్ణయంతో.. పాక్​ బియ్యానికి ఫుల్​ డిమాండ్

ఇండియా నిర్ణయంతో.. పాక్​ బియ్యానికి ఫుల్​ డిమాండ్
  •     మనదేశం ఎగుమతులను బ్యాన్ చేయడంతో.. ఆ దేశానికి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆర్డర్స్ పెరిగి కాసులపంట 

ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్​కు మన దేశం తీసుకున్న నిర్ణయం కలిసివచ్చింది. వచ్చే పండుగల సీజన్​ను దృష్టిలో ఉంచుకుని బాస్మతి రైస్ మినహా.. బియ్యం ఎగుమతులను మనదేశం నిలిపివేసింది. దీంతో చాలా దేశాల్లో రైస్ కొరత ఏర్పడింది. ఇది కాస్త పాకిస్తాన్​కు కలిసి వచ్చింది. ప్రస్తుతం ఆ దేశ బియ్యానికి ప్రపంచ మార్కెట్​లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కంపెనీలకు ఆర్డర్స్ విపరీతంగా పెరిగాయని పాక్ రైస్ ఎక్స్​పోర్టర్స్ అసోసియేషన్ చైర్మన్ చెలా రామ్ కెవ్లానీ మీడియాకు తెలిపారు. ఇంటర్నేషనల్ కొనుగోలుదారులు పాక్ ఎగుమతిదారులవైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. అమెరికా, బ్రిటన్​తో పాటు యూరప్ దేశాల నుంచి డిమాండ్ పెరిగిందన్నారు. కాగా, మనదేశం బియ్యం ఎగుమతి బ్యాన్ చేయకముందు పాక్​ బియ్యం టన్నుకు ఇంటర్నేషనల్ మార్కెట్​లో రూ.37,257 ఉండగా.. ఇప్పుడది రూ.41,400కు పెరిగింది. కొద్దిరోజుల్లో అది రూ.50,000కు కూడా పెరగవచ్చని ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు.