స్టార్ ఇండియాకు జీ రూ.68 కోట్ల డిమాండ్ నోటీస్‌

స్టార్ ఇండియాకు జీ  రూ.68 కోట్ల డిమాండ్ నోటీస్‌

న్యూఢిల్లీ: ఐసీసీ క్రికెట్‌‌ టీవీ బ్రాడ్‌‌కాస్ట్ రైట్స్‌‌ అగ్రిమెంట్ ప్రకారం స్టార్‌‌‌‌ ఇండియా నడుచుకోలేదని జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌ ఆరోపించింది.  వాల్ట్‌‌ డిస్నీకి చెందిన ఈ కంపెనీ నుంచి రూ.68.54 కోట్ల రిఫండ్‌‌ను డిమాండ్ చేసింది.   

ఐసీసీ మెన్స్‌‌, అండర్‌‌‌‌ 19 ఇంటర్నేషనల్ మ్యాచుల టీవీ బ్రాడ్‌‌కాస్టింగ్ రైట్స్‌‌ను 2024–2027 కాలానికి గాను సబ్‌‌లైసెన్స్‌‌ పొందేందుకు ఈ ఇరు కంపెనీలు అలయెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి.  అవసరమైన అనుమతులు పొందడంలో, అగ్రిమెంట్‌‌ను అమలు చేయడంలో  స్టార్ ఇండియా ఫెయిలైందని జీ పేర్కొంది. 

అగ్రిమెంట్ ప్రకారం,  రైట్స్ ఫీజులు రూ.1,693.42 కోట్లలో మొదటి ఇన్‌‌స్టాల్‌‌మెంట్‌‌ను చెల్లించలేదని జీ కి  కిందటేడాది డిసెంబర్ 31 న స్టార్‌‌‌‌ ఇండియా  లీగల్‌‌ లెటర్స్ పంపిన విషయం తెలిసిందే. బ్యాంక్ గ్యారెంటీల కోసం అదనంగా రూ.17 కోట్లను  కూడా ఈ కంపెనీ డిమాండ్ చేసింది.