నీట్ పేపర్ లీకేజీలపై నిరవిధిక నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ.. వినూత్న తీరుతో నిరసనలకు దిగింది. నాలుగవ రోజయిన జూన్ 23 న చేపట్టిన డైపర్ డొనేషన్ డ్రైవ్ దేశ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. ఎవరి డైపర్ వారు తెచ్చుకుని.. మంత్రి రాజీనామా డిమాండ్ ను రాయాలని ఆ పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే పిలుపునివ్వడంతో సాయంత్రం జంతర్ మంతర్ దగ్గర డైపర్లతో నిరసన చేపట్టారు కాక్రోచ్ పార్టీ మద్ధతుదారులు.
చిన్న పిల్లలకు మోషన్, యూరిన్ లీక్ అవ్వకుండా డైపర్ ఎలా అడ్డుకుంటుందో.. అదే విధంగా డైపర్ ద్వారా లీకేజీలను ఆపాలనే సందేశాన్ని వినూత్నంగా తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో ఎవరి డైపర్ వారే తెచ్చుకోవాలని పార్టీ పిలుపునిచ్చింది. దీనికి తోడు.. ఎవరైనా డైపర్స్ డొనేట్ చేయాలని కూడా కోరింది.
►ALSO READ | ముంబైలో బీభత్సమైన వర్షం : సిటీ మొత్తం జలమయం.. కొట్టుకుపోయిన రైలు పట్టాలు..
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా కోరుతూ సీజేపీ గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు డైపర్ డొనేట్ చేద్దాం.. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో ఉన్న శాఖలో లీకేజీలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందరూ డైపర్లు తెచ్చుకుని.. డిమాండ్స్ రాసి.. మంత్రికి డొనేట్ చేయాలని పిలుపునిచ్చారు. సాయంత్రం 6 గంటలకు జంతర్ మంతర్ ధర్నాం కేంద్రం డైపర్లతో నిండిపోయింది.
ఎవరి డైపర్ వాళ్లు తెచ్చుకోండి.. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని రాయండి.. డ్రాప్ బాక్సులో వేయండంటూ తయారు చేసిన పాంప్లెట్ అందరినీ ఆకర్శిస్తోంది. సోషల్ మీడియాలో డైపర్ డొనేషన్ డ్రైవ్ వైరల్ గా మారింది. డైపర్ డొనేషన్ డ్రైవ్ ఫర్ ధర్మేంద్ర ప్రదాన్ అనే ప్రచారం వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Diaper A Day Keeps Leaks Away
— Cockroach is Back (@Cockroachisback) June 23, 2026
Launching a Diaper Donation Drive - today at Jantar Mantar, 6 PM.
Bring a diaper, write your demand for his resignation on it, and we'll make sure it reaches education minister. pic.twitter.com/wDqQG0kxfI
