పాత కొత్తగూడెంలో ఇళ్లను కూల్చివేయడం దారుణం

V6 Velugu Posted on Aug 03, 2021

కొత్తగూడెంలో ఇళ్లను కూల్చివేయడాన్ని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుపట్టారు. ముందస్తు హెచ్చరికలు కూడా లేకుండా ఇళ్లను కూల్చి వేయడం దారుణమన్నారు. పాతకొత్తగూడెంలో రైలు పట్టాల పక్కన నిర్మించుకున్న ఇళ్లను రైల్వే అధికారులు కూల్చేశారు. విషయం తెలుసుకున్న ప్రవీణ్ కుమార్ ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు.

ఆ తర్వాత  మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే బాధితులకు ఇచ్చిన హామీలను నిరవేర్చకపోతే ప్రత్యేక్ష ఆందోళనలకు దిగుతామని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారు.

Tagged Demolition, RS Praveen Kumar , houses, old Kothagudem

Latest Videos

Subscribe Now

More News