కేంద్ర ప్రభుత్వ మింట్లో ఉద్యోగాలు.. ఐటీఐ, డిగ్రీ, బిటెక్ చేసినోళ్లకి ఛాన్స్..

కేంద్ర ప్రభుత్వ మింట్లో ఉద్యోగాలు.. ఐటీఐ, డిగ్రీ, బిటెక్ చేసినోళ్లకి ఛాన్స్..

భారత ప్రభుత్వ ఆధీనంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్​పీఎంసీఐఎల్) విభాగమైన భారత ప్రభుత్వ మింట్ (ఐజీఎం) ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, నోయిడాలోని శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 94.

విభాగాల వారీగా ఖాళీలు: సూపర్​వైజర్ అస్సే 02, టి.ఒ. మెషినిస్ట్ 01, టి.ఒ. మెకానికల్ 02, టి.ఒ. మెటలర్జీ 01, ఎంగ్రేవర్ శిల్పం/ లోహపు పనులు 01, జూనియర్ హిందీ టైపిస్ట్ 01, లాబొరేటరీ అసిస్టెంట్​ 01, జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్) 47, జూనియర్ టెక్నీషియన్ అటెండెంట్ ఆపరేటర్– కెమికల్ ప్లాంట్ 03, జూనియర్ టెక్నీషియన్ 07, జూనియర్ టెక్నీషియన్ (కార్పెంటరీ) 01, జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ర్టిషియన్) 02, జూనియర్ టెక్నీషియన్ గోల్డ్​స్మిల్ 01, జూనియర్ టెక్నీషియన్  (మెల్టర్) 01. 

విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బి.టెక్, ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మార్చి 28.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 27. 

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.200. 

ఆన్‌లైన్ పరీక్ష : జూన్/జూలై 2026 (తాత్కాలికం)

సెలెక్షన్ ప్రాసెస్
ఆన్‌లైన్ పరీక్ష: ఆబ్జెక్టివ్ తరహాలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, ఇంగ్లిష్, సంబంధిత సబ్జెక్టుపై ప్రశ్నలు ఉంటాయి.

స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్: కేవలం కొన్ని పోస్టులకు (ఉదా: ఆఫీస్ అసిస్టెంట్, టెక్నీషియన్) మాత్రమే ఉంటుంది.

డాక్యుమెంట్ వెరిఫికేషన్: మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ igmnoida.spmcil.comను సంప్రదించండి.