ఇరాన్ పవర్ కేంద్రాలపై దాడుల విరామాన్ని మరో 10 రోజులు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయి.. ఇరాన్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇరాన్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎనర్జీ ప్లాంట్ల ధ్వంసం ప్రక్రియను ఏప్రిల్ 6, 2026 సోమవారం రాత్రి 8 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు తెలియజేస్తున్నాను..చర్చలు కొనసాగుతున్నాయి.. ఫేక్ న్యూస్ మీడియా,ఇతరులు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు విరుద్ధంగా, చర్చలు ఆశాజనకంగా సాగుతున్నాయంటూ ట్రంప్ పోస్ట్ చేశారు.
ఇరాన్ 7 రోజులు అడిగింది, నేను 10 రోజులు ఇచ్చాను:ట్రంప్
ఫాక్స్ న్యూస్ (Fox News)తో ట్రాంప్ మాట్లాడుతూ.. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల క్రమంలో ఇరుపక్షాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన చర్చల్లో ఇరాన్ ప్రభుత్వం మరికొంత సమయం కోరిందని ట్రంప్ తెలిపారు. ఇవాళ్టితో ఇరాన్ కు పెట్టిన డెడ్ లైన్ ముగుస్తుంది. ఇరాన్ తన షరతులకు ఒప్పుకోకపోతే వారి పవర్ ప్లాంట్లు ఖచ్చితంగా ధ్వంసం చేస్తానని భయంతో మరికొంత సమయం ఇవ్వగలరని అడిగారు.. ఇరాన్ 7 రోజులు టైం అడిగింది. అయితే నేనే 10 రోజులు ఇస్తున్నానని చెప్పాను అని ట్రంప్ అదనంగా వెల్లడించారు.
మేం ఇప్పటికే యుద్ధంలో గెలిచాం: ట్రంప్
మరోవైపు ఇరాన్‌తో జరుగుతున్న సైనిక పోరాటంలో అమెరికా ఇప్పటికే విజయం సాధించిందని గురువారం ట్రంప్ నొక్కి చెప్పారు. అమెరికా ,ఇజ్రాయెల్ జరిపిన దాడులు ఇరాన్ నౌకాదళ ,క్షిపణి సామర్థ్యాలను చాలావరకు దెబ్బతీశాయని చెప్పారు. సైనిక పరంగా మేం ఇప్పటికే యుద్ధంలో గెలిచాం. పూర్తిగా విజయం సాధింమని ట్రంప్ అన్నారు. డజన్ల కొద్దీ నౌకలతో సహా ఇరాన్ నౌకాదళ ,వైమానిక దళ ఆస్తులను అమెరికా సమర్థవంతంగా నాశనం చేసిందని, అలాగే ఇరాన్ క్షిపణి దళాలను చాలావరకు దెబ్బతీసిందని ట్రంప్ వివరించారు.
