అక్రమ కట్టడాల కూల్చివేత.. రోడ్డున పడ్డ కుటుంబాలు

అక్రమ కట్టడాల కూల్చివేత.. రోడ్డున పడ్డ కుటుంబాలు

కుత్బుల్లాపూర్ పరిధిలోని దేవేందర్ నగర్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝాలిపించారు. ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అయితే  కూల్చివేతలకు నిరసనగా‌ దేవేందర్ నగర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి ఎంఆర్వో డౌన్ డౌన్ అంటూ బాధితులు నినాదాలు చేపట్టారు.  

దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కూల్చివేతలతో తమ జీవితాలు రోడ్డున పడ్డాయని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. కొందరు తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్ తో హాస్పిటల్ లో కూడా చేరారు.  తాము దళారుల చేతిలో మోసపోయామని, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి  చేస్తున్నారు.  

కుత్బుల్లాపూర్ రెవెన్యూ పరిదిలోని గాజులరామరంలో ఆర్.డి.ఓ మల్లయ్య ఆధ్వర్యంలో భారీ కూల్చివేతలు చేపట్టారు. గాజులరామరం, దేవేందర్ నగర్ లోని ప్రభుత్వ భూమి 342 సర్వే నెంబర్ లో అక్రమ కట్టడాలను 4 జేసీబీలతో కూల్చివేశారు జిల్లా రెవెన్యూ యంత్రాంగం. పోలీస్ ప్రొటక్షన్ తో 4 జేసీబీలు,4 డీసీఎంలు, 2 వాటర్ ట్యాంకర్లు, గోనె సంచులతో భారీ స్థాయిలో కూల్చివేతలు జరిపారు అధికారులు.