శంషాబాద్ మండలం మదనపల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

శంషాబాద్ మండలం మదనపల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

గండిపేట, వెలుగు: శంషాబాద్ మండలం మదనపల్లి సర్వే నంబర్ 50లో ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు బుధవారం కూల్చివేశారు. గత నెలల నుంచి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు ఫిర్యాదు రావడంతో స్పందించిన అధికారులు ఈ చర్య తీసుకున్నారు. అడ్డుకున్న స్థానికులను పోలీసులు అక్కడ నుంచి తరలించారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని అధికారులు హెచ్చరించారు.