గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడి చేస్తే.. నాటో అంతమే!..యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డెన్మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రధాని హెచ్చరిక

గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడి చేస్తే.. నాటో అంతమే!..యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డెన్మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రధాని హెచ్చరిక

కోపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హగెన్: గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అమెరికా దాడి చేస్తే, నాటో కూటమే అంతమవుతుందని డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్ హెచ్చరించారు. గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘‘నాటో కూటమిలోని తోటి సభ్య దేశంపై అమెరికా దాడికి ప్రయత్నిస్తే, సంబంధాలన్నీ తెగిపోతాయి. రెండో ప్రపంచ యుద్ధ అనంతరం నుంచి కొనసాగుతున్న సైనిక సహకారం ఆగిపోతుంది. 

చివరకు నాటో కూటమే అంతమైపోతుంది” అని ఫ్రెడెరిక్సన్ హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలను గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ కూడా తీవ్రంగా ఖండించారు. ఒకవేళ అమెరికా తమపై దాడికి పాల్పడితే, ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. యూఎస్ బెదిరింపుల నేపథ్యంలో డెన్మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు యూరోపియన్ దేశాలు మద్దతు ప్రకటించాయి. కాగా, డెన్మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగమైన గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ తన మొదటి టర్మ్ నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. 

దాన్ని ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చారు. వెనెజువెలా ప్రెసిడెంట్ మదురో అరెస్టు అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మరో 20 రోజుల్లో గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్ గురించి మాట్లాడుకుందాం” అని అన్నారు. దేశ భద్రత దృష్ట్యా తమకు గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్ అవసరమని పేర్కొన్నారు. దీంతో గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అమెరికా దాడి చేయబోతున్నదని ఆందోళన మొదలైంది.