
కేంద్రంలో మోదీ 3.0 శాఖల కేటాయింపు పూర్తియింది. దాదాపుగా పాత మంత్రలుకే కీలక శాఖలు దక్కాయి. అమిత్ షాకు మరోసారి కేంద్ర హోంశాఖ కేటాయించగా... నితిన్ గడ్కరీకి మళ్లీ రోడ్డు రవాణా శాఖ, రాజ్‌నాథ్‌కు మళ్లీ రక్షణశాఖ, నిర్మలాసీతారామన్‌కు మళ్లీ ఆర్థికశాఖ.. జయశంకర్‌కు మళ్లీ విదేశాంగ శాఖను కట్టబెట్టారు. ఇక ప్రధాని మోదీ వద్ద సిబ్బంది వ్యవహారాలు, పించన్లు, పబ్లిక్ గ్రీవెన్స్, అణు శక్తి, అంతరిక్షం, కీలక విధాన సంబంధిత అంశాలతోపాటు ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు అయన వద్దే ఉన్నాయి.
ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ, బండి సంజయ్ కుమార్ కు హోంశాఖ సహాయమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఏపీ విషయానికి వస్తే శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడుకు పౌరవిమానయాన శాఖను కేటాయించారు. ఇక శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, స్టీల్ శాఖల సహాయమంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ కి గ్రామీణ అభివృద్ధి శాఖ, కమ్యూనికేషన్ సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు.