
తన తల్లి అకాల మరణాన్ని తట్టుకోలేని ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపై పడుకున్నాడు. అయితే సకాలంలో స్పందించిన రైల్వే పోలీసులు ఆ వ్యక్తిని ప్రమాదం నుంచి కాపాడారు. ముంబైలోని విరార్ రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. రైల్వే స్టేషన్‌లో అందరూ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ వ్యక్తి రైల్వే పట్టాల మీదకు వెళ్లి పడుకున్నాడు. అయితే రైలు ఆతడిని సమీపించే లోపు అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. రెప్పపాటులో పట్టాల పైనుంచి పక్కకు లాగేశారు. అతడిని లాగేసిన క్షణాల్లోనే రైలు ఆ ట్రాక్ నుంచి వెళ్లిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే తన తల్లి మరణంతో ఆ వ్యక్తి మానసికంగా కుంగిపోయాడని దీంతో.. ఆత్మహత్యకు ప్రయత్నించాడని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#WATCH: RPF personnel averted a suicide attempt when they dragged a man out of railway tracks where he was lying down as a train was approaching him, at Virar railway station in Mumbai. The man was allegedly disturbed by the demise of his mother. (24.02)
(Souce: Indian Railways) pic.twitter.com/gbp5cn5WXw
— ANI (@ANI) February 26, 2021