ఎస్​సీఈఆర్టీలో 26 మంది టీచర్ల డిప్యూటేషన్లు రద్దు

ఎస్​సీఈఆర్టీలో 26 మంది టీచర్ల డిప్యూటేషన్లు రద్దు
  • పాఠాలు చెప్పాల్సిందేనని స్కూళ్లకు పంపించిన విద్యాశాఖ 
  • గత సర్కారు సిఫారసులతో ఏండ్ల నుంచి తిష్ఠవేసిన టీచర్లు

హైదరాబాద్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా.. ఏండ్ల నుంచి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎస్​సీఈఆర్టీ)లో పాతుకుపోయిన టీచర్లను ఆఫీసర్లు స్కూళ్ల బాట పట్టించారు. ఏకంగా26 మంది టీచర్ల డిప్యూటేషన్లను రద్దు చేశారు. దీంట్లో కొందరు 15–20 ఏండ్ల నుంచి స్కూల్ మొహమే చూడ ని వారున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ఆదేశాలు జారీచేశారు.

తొలగించిన వారిలో ఫారిన్ సర్వీస్ కింద 10 మంది పనిచేస్తుండగా.. డిప్యూటేషన్, ఆన్​ డ్యూటీ (ఓడీ) పేర్లతో మరో 16 మంది ఉన్నారు. వీరిలో దాదాపు గత బీఆర్ఎస్ సర్కారులోని మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులతో వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారు. అయితే, ఫారెన్ సర్వీసులో పనిచేస్తున్న వారంతా లెక్చరర్ హోదాలో పనిచేస్తున్నారు. కొందరు ఎస్​జీటీలు కూడా ఈ లిస్టులో ఉండటం గమనార్హం.

వారిలో కొందరు టీచర్లను ఎప్పుడూ చూడ లేదని, వర్క్ షాపుల్లోనూ కనిపించలేదని ఎస్​సీఈఆర్టీ వర్గాలే చెప్తుండటం అనుమానాలు తావిస్తోంది. దీన్ని బట్టి వారు అటు స్కూల్​కు వెళ్లలేదని, ఇటు ఎస్​సీఈఆర్టీలోనూ పనిచేయలేదని తెలుస్తోంది. ఇలాంటి అంశాలన్నీ ఇటీవల విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం రివ్యూ చేసిన టైంలో బయటపడడంతో ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు.

మొత్తం సర్వీసులో మూడేండ్ల కంటే ఎక్కువకాలం ఫారిన్ సర్వీస్, డిప్యూటేషన్, ఓడీ తదితర రూపాల్లో పనిచేస్తున్న వారందరిని స్కూళ్లకు పంపించాలని ఆదేశాలిచ్చారు. దీనికి అనుగుణంగా వారి డిప్యూటేషన్లు రద్దు చేశారు. ఎస్​సీఈఆర్టీ ప్రక్షా ళనలో భాగంగా విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై టీచర్ల సంఘాలు, టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

ఫారిన్​ సర్వీస్​లో ఉన్న టీచర్లు వీరే.. 

వెంకట్ రెడ్డి (ఎస్​ఏ ఇంగ్లిష్​), జి.ఉషా(ఎస్​ఏ తెలుగు), సువర్ణ వినాయక్ (ఎల్​ఎఫ్ఎల్ హెచ్​ఎం), బి.అశోక్ రెడ్డి (ఎస్​ఏ ఇంగ్లిష్​), జి.శ్రీనివాస్ రెడ్డి (ఎస్​ఏ మ్యాథ్స్), జే.కృష్ణనాగమణి (ఎస్​ఏ ఇంగ్లిష్), పి.భూమయ్య (ఎస్​ఏ ఫిజిక్స్), టి.మనోహర చారి (జీహెచ్​ఎం), ఏ.నాగమణి (ఎస్​జీటీ), కే.పుష్పలత (ఎస్​ఏ మ్యాథ్స్) 

డిప్యూటేషన్, ఓడీల కింద పనిచేసిన టీచర్లు వీరే..

ఐ.కరుణశ్రీ(ఎస్​ఏ ఇంగ్లిష్), వీ.లతామాధవి (ఎస్​ఏ ఇంగ్లిష్​), ఎండీ ఇఫ్తేకారుద్దిన్ (ఎస్​ఏ ఇంగ్లిష్),  జి.త్రివేణి (ఎస్​ఏ ఇంగ్లిష్), ఆర్.వాసవి (ఎస్​ఏ ఇంగ్లిష్), ఎండీ అయూబ్ అహ్మద్ (ఎస్​ఏ ఫిజిక్స్), ఆర్.రాజారెడ్డి (ఎస్​ఏ ఇంగ్లిష్), పి.జగదీశ్వర్ రెడ్డి (ఎస్​జీటీ), ఎస్.చందన (ఎల్​పీ హిందీ), డి.నాగరాజు (ఎస్​ఏ బయోసైన్స్), కే.శ్రీధరాచార్యులు (ఎస్​ఏ మ్యాథ్స్), ఎం.అరుణశ్రీ(ఎస్​ఏ ఫిజిక్స్), ఎం.మంగతాయారమ్మ (ఎస్​ఏ హిందీ), ఎస్.రవి ప్రకాశ్ రావు(ఎస్​జీటీ), ఏ.చంద్రశేఖర్ రెడ్డి (ఎస్​ఏ మ్యాథ్స్), ఎం.అర్జున్ (జీహెచ్ఎం).