- ఎస్టీఎఫ్ క్యాలెండర్ ను ఆవిష్కరణ
మధిర, వెలుగు : తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి 'గేమ్ చేంజర్'గా నిలుస్తాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
గురువారం తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఎస్టీఎఫ్ 2026 క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కేవలం సంపన్న వర్గాలకే పరిమితమైన నాణ్యమైన విద్యను ఇకపై సామాన్య ప్రజలకు, అణగారిన వర్గాల బిడ్డలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.
విద్యారంగంలో ప్రభుత్వం చేపట్టిన ఈ సంస్కరణలు భవిష్యత్ తరాలకు గొప్ప వరమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు, ఉపాధ్యక్షుడు జపాన్ రావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, ఎస్టీఎఫ్ జిల్లా బాధ్యులు గండు యాదగిరి, షేక్ మన్సూర్, ఎస్టీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
