ఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయిలు రూ.303 కోట్లు రిలీజ్ చేయండి : డిప్యూటీ సీఎం భట్టి

ఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయిలు  రూ.303 కోట్లు రిలీజ్ చేయండి : డిప్యూటీ సీఎం భట్టి
  • డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ  మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన ఓవర్సీస్ స్కాలర్‌‌షిప్ బకాయిలు రూ. 303 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌‌లో ఉన్న 2,288 మంది లబ్ధిదారులకు చెందిన బకాయిలన్ని ఒకేసారి క్లియర్ చేయాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ప్రజా భవన్​లో డిప్యూటీ సీఎం భట్టి ఆర్థిక శాఖ అధికారులతో రివ్యూ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. 

గత ప్రభుత్వ కాలం నుంచి ఓవర్సీస్ స్కాలర్ షిప్ అందకపోవడంతో విదేశాల్లో ఉన్న విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఒకవైపు ఓవర్సీస్ స్కాలర్ షిప్ అందక మరోవైపు అమెరికా, యూకే వంటి దేశాల్లో కొత్త ఆంక్షలతో విద్యార్థులపై మానసిక ఒత్తిడి తీవ్రమైందని పేర్కొన్నారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.