టేస్టీ ఫుడ్ అందించాలి..మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం

టేస్టీ ఫుడ్ అందించాలి..మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
  • టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో మహిళా శక్తి క్యాంటీన్ పరిశీలన  

హైదరాబాద్, వెలుగు: కరెంట్​ఆఫీస్​కు వచ్చే ఉద్యోగులు, వినియోగదారులకు రుచికరమైన ఆహారం అందించాలని మహిళాశక్తి క్యాంటిన్​నిర్వాహకులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. గురువారం హైదరాబాద్​మింట్ కాంపౌండ్‌‌‌‌లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన 'మహిళాశక్తి క్యాంటీన్'ను ఆయన పరిశీలించారు. క్యాంటీన్ ఏర్పాటుకు అయిన ఖర్చు, ఉద్యోగులకు కల్పించిన వివిధ రకాల వసతులు, మౌలిక సౌకర్యాల గురించి సంస్థ సీఎండీ జితేష్ వి.పాటిల్‌‌‌‌ వివరించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబన, ఉద్యోగులకు పరిశుభ్రమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగులు, సందర్శకులకు సరసమైన ధరలకే నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని క్యాంటీన్​నిర్వాహకులకు సూచించారు. అనంతరం క్యాంటీన్‌‌‌‌లో ఏర్పాటు చేసిన మెనూ బోర్డు, ధరల పట్టికను ఆయన పరిశీలించారు. డిప్యూటీ సీఎం వెంట సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రకాశ్, ఎస్పీడీసీఎల్ 
డైరెక్టర్లు ఉన్నారు.