- సివిల్ సర్వీస్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: ప్రజలు ఒక అధికారిగా మాత్రమే కాకుండా, ప్రజాసేవకుడిగా గుర్తు పెట్టుకున్నప్పుడే సివిల్ సర్వీసెస్ హోదాకు న్యాయం జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్‌హెచ్ఆర్డీ)లో ఆలిండియా, సెంట్రల్ సర్వీసెస్ అధికారుల 10 వారాల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 203 మంది అధికారులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం ప్రసంగిస్తూ.. మీరు డాక్టర్లు, ఇంజనీర్లు, నిపుణులుగా ఇక్కడికి వచ్చా రని, ఇప్పుడు అత్యున్నత స్థాయి బాధ్యతలతో బయటకు వెళ్తున్నారని గుర్తుచేశారు. విధి నిర్వహణలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఎంతో కీలకమని భట్టి విక్రమార్క అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంసీఆర్‌హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ శాంతకుమారి పాల్గొన్నారు.
