బీఆర్ఎస్​ సర్కారే ఆర్టీసీని ముంచింది: భట్టి విక్రమార్క

బీఆర్ఎస్​ సర్కారే ఆర్టీసీని ముంచింది: భట్టి విక్రమార్క
  • హక్కుల కోసం పోరాడిన ఉద్యోగులను దారుణంగా అణచివేశారు: భట్టి
  •     కాంగ్రెస్​ సర్కారు రాగానే ఆర్టీసీకి పూర్వవైభవం వచ్చిందని వెల్లడి
  •     ఎలక్ట్రికల్ బస్సుల ప్రారంభం 

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్​ఎస్​ సర్కారు రాష్ట్రాన్ని దివాలా తీయించిందని, ముఖ్యంగా ఆర్టీసీని పీకల్లోతు నష్టాల్లోకి నెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హక్కుల కోసం ఆర్టీసీ కార్మికు లు ఆందోళనకు దిగితే కనీసం దయ లేకుండా అణ చివేసిందన్నారు. కానీ కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఆర్టీసీకి పూర్వవైభవం వచ్చిందన్నారు. ఆర్టీసీ కొత్తగా ప్రవేశ పెట్టిన ఎలక్ట్రిక్​ బస్సులను భట్టి విక్రమార్క మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డు సమీపంలోని అంబేద్కర్​ విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ​అధికారం చేపట్టిన 90 రోజుల్లోనే 6 గ్యారంటీల్లో ఉన్న మ హాలక్ష్మి, ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచడం, రూ.500లకే గ్యాస్​ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి హామీలను అమలు చేశామన్నారు. బీఆర్​ఎస్​పదేండ్లలో చేయలేని పనులను కాంగ్రెస్​ అమలు చేసి చూపిస్తున్నదన్నారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ నష్టాల్లోంచి బయటకు వస్తున్నదన్నారు. ఆర్టీసీని, సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని దృ ష్టిలో పెట్టుకునే ప్రభుత్వం బాండ్ల పై  రూ.280 కోట్లను విడుదల చేసిందన్నారు. ఉద్యోగులకు 21 శాతం ఫిట్​మెంట్​ప్రకటించిందన్నారు.  

ఆర్టీసీ బస్సులు కళకళ

మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీని మరింత బలంగా తయారు చేస్తామన్నారు. ఆర్​అండ్​బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణా నికి కేంద్రం నుంచి రూ.850 కోట్లు సాధించామని, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరిన్ని నిధులు సమకూరుస్తున్నదన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, ఆర్టీసీ ఎండీ​ సజ్జనార్ పాల్గొన్నారు.