కాంగ్రెస్కు వ్యవసాయానికి విడదీయరాని సంబంధం: భట్టి విక్రమార్క

కాంగ్రెస్కు  వ్యవసాయానికి విడదీయరాని సంబంధం: భట్టి విక్రమార్క

కాంగ్రెస్ కు వ్యవసాయానికి విడదీయరాని సంబంధం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతుల కోసం కాంగ్రెస్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నాను. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని అగ్రి వర్శిటీలో రైతు నేస్తం ప్రారంభం సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడారు.

కాంగ్రెస్ అంటేనే రుణమాఫీ,మద్దతు ధర, బోనస్,. కాంగ్రెస్ అంటేనే ఉచిత కరెంట్. కాంగ్రెస్ కు రైతులకు విడదీయరాని సంబంధం ఉంది. 1034 వేదికల్లో రైతు నేస్తం ప్రోగ్రాం.  రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేశాం.  అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ చేశాం. రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నాం.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట నష్టపోతే రైతులకు పరిహారం ఇవ్వలేదు. ఐదేళ్లలో  రైతుల కోసం మూడున్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా ఒక్క పథకాన్ని ఆపలేదు. సీఎం రేవంత్ రైతు భరోసా నిధులు ఇక్కడి నుంచే రిలీజ్ చేస్తారు.

ఎన్ని ఎకరాలున్నా వ్యవసాయ యోగ్యమైన భూములకు పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  9 రోజుల్లో ప్రతి రైతులందరి ఖాతాలో డబ్బులు పడతాయని చెప్పారు భట్టి.