కరోనా వైరస్ పై ఏపీ పని తీరు అద్భుతం : యూకే డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్

కరోనా వైరస్ పై ఏపీ పని తీరు అద్భుతం : యూకే డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్

కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషిని చూసి ప్రపంచ దేశాలు పాఠాలు నేర్చుకోవాలని అన్నారు యూకే డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్. ఏపీలో తరహా యూకే లో వాలంటీర్ వ్యవస్థను అమలు చేసేందుకు ఆ దేశాధినేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ విధివిధానాలు, కరోనా వైరస్ ను అరికట్టేందుకు సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై  యూకే  డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ఆరా తీశారు. ముఖ్యంగా కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు 11,158 గ్రామ కార్యదర్శులు, 4.5 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని కొనియాడారు.

ఏపీ ప్రభుత్వం నుంచి యూకే డిప్యూటీ హై కమిషన్ సలహాలు తీసుకుంటుందని, దేశం మొత్తం ఏపీ పరిపాలన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఏపీ సక్సెస్ మోడల్ దేశ వ్యాప్తంగా ఆకర్షిస్తుంది. ప్రభుత్వం పనితీరుపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, జాతీయ మీడియా సైతం ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.