శోభన్ బాబు విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్త.. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి

శోభన్ బాబు విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్త.. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి

సికింద్రాబాద్,వెలుగు: సినీ నటుడు శోభన్ బాబు విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం శోభన్ బాబు 88వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి ఆర్గనైజర్ రామ్ వర్మ ఆధ్వర్యంలో తార్నాక చౌరస్తాలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత  రెడ్డి, బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, సేవా సమితి చైర్మన్ తమ్మిళి రామకృష్ణ హాజరై శోభన్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శోభన్ బాబు క్యాలెండర్, చిత్రమాలిక సంచికను ఆవిష్కరించి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవాసమితి ప్రతినిధులు పద్మారావు, అశోక్, టి శ్రీనివాసరావు, గంగాధర్, శ్రీనివాస్, జగన్, జీవీఎస్ ప్రసాద్, ప్రతాపరెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.