సర్పంచ్​పై చెప్పుతో దాడి చేసిన ఉపసర్పంచ్

సర్పంచ్​పై చెప్పుతో దాడి చేసిన ఉపసర్పంచ్

భైంసా, వెలుగు: సర్పంచ్​పై ఉపసర్పంచి చెప్పుతో దాడి చేసింది. నిర్మల్​జిల్లా భైంసా మండలం మహాగాం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఉపసర్పంచి భర్త ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఆవరణలో గురువారం నిధుల దుర్వినియోగంపై డీఎల్​పీవో శివకృష్ణ సమక్షంలో విచారణ జరిగింది. నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు ఎవరి వాదన వారు వినిపించారు. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్​అప్పాల రాకేష్​, ఉప సర్పంచ్​ కోటగిరి శారద మధ్య మాటల యుద్ధం మొదలైంది. కొద్దిసేపటికి మాటామాట పెరగడంతో ఆవేశానికి లోనైన శారద సర్పంచ్​ రాకేశ్​పై చెప్పుతో దాడి చేసింది. అక్కడున్న వార్డుమెంబర్లు ఎవరికి వారు గొడవకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. భైంసా రూరల్​ పోలీస్​స్టేషన్​లో సర్పంచ్​రాకేశ్, ఉప సర్పంచ్​శారద ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు.