రోహ్‌తక్(హర్యానా): సాధ్వీలపై లైంగిక దాడి కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోసారి పెరోల్‌పై విడుదలయ్యారు. సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. దీంతో మంగళవారం ఉదయం 6:34 గంటలకు ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.
కాగా, 2017 ఆగస్టులో ఆయనను దోషిగా తేల్చి కోర్టు జైలుకు పంపించింది. అప్పటి నుంచి పెరోల్‌పై రామ్‌రహీమ్ బయటకు రావడం ఇది 16వ సారి. తాజా పెరోల్‌తో కలిపితే గత తొమ్మిదేండ్లలో ఆయన జైలు బయట గడిపిన మొత్తం రోజుల సంఖ్య 436కు చేరుకుంటుంది.
