
హైదరాబాద్, వెలుగు: పునరుత్పాదక ఇంధన సంస్థ డీఈఎస్ఆర్ఐ (గతంలో డీఈ షా రెన్యూవబుల్ ఇన్వెస్ట్‌మెంట్స్) హైదరాబాద్‌లోని ఆర్ఎమ్జెడ్ నెక్సిటీలో తమ నూతన కేపబిలిటీ సెంటర్ను ప్రారంభించింది.
హైదరాబాద్ తమకు కీలక కేంద్రమని ప్రకటించింది. 2014లో హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన డీఈఎస్ఆర్ఐ, అకౌంటింగ్, ఇంజినీరింగ్, ఫైనాన్స్, లీగల్ వంటి విభాగాల్లో తమ సామర్థ్యాలను విస్తరించింది.
స్థానిక ప్రతిభను ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాలు, కళాశాలలతో కలసి పనిచేస్తామని డీఈఎస్ఆర్ఐ సీఈఓ డేవిడ్ తెలిపారు.