వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలంటే.. ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ తప్పనిసరా..?

వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలంటే.. ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ తప్పనిసరా..?

ఓటర్ ఐడీకి ఆధార్ ను లింక్ చేయటంపై చాలా కాలంగా ఒక కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఓటర్ ఐడీకి ఆధార్ ను అనుసంధానం చేయాలని 2015లోనే ఈసీ నిర్ణయించింది. అయితే, ఆధార్ ను కేవలం ప్రభుత్వ పథకాల పంపిణీ కోసమే అని సుప్రీమ్ కోర్ట్ నుండి తీర్పు  వచ్చాక ఆ ప్రక్రియను నిలిపేసింది ఈసీ. ఆ తర్వాత 2021లో పార్లమెంట్ లో ఎలక్షన్ చట్టంలో సవరణలు చేసిన తర్వాత ఈసీ ఆధార్ అనుసంధాన ప్రక్రియను తిరిగి ప్రారంభించింది.

గత సంవత్సరం తెలంగాణ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ నిరంజన్ రెడ్డి సుప్రీమ్ కోర్టులో ఓటర్ ఐడీ, ఆధార్ అనుసంధానం పై పిటీషన్ వేశారు. ఆధార్ వివరాలు ఇవ్వటం ఇష్టం లేని పౌరులకు మద్దతుగా సవరణలు చేయాలని ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై జరిగిన విచారణలో ఈసీ బదులిస్తూ రిజిస్ట్రేషన్ ఫామ్స్ లో ఆధార్ నంబర్ కాలం వద్ద అప్షనల్ అని ఉంటుందని, ఆధార్ వివరాలు ఇవ్వటం ఇష్టం లేని వారు ఆ కాలమ్ ను కాలిగా వదిలేస్తే సరిపోతుందని, సవరణలు అవసరం లేదని తెలిపింది. ఈసీ వాదనలతో కోర్ట్ అంగీకరించింది.