స్కిన్​కేర్​లో​ డీటాక్స్ చాలా ముఖ్యం

స్కిన్​కేర్​లో​ డీటాక్స్  చాలా ముఖ్యం

ఫేషియల్​ స్కిన్​ను రెగ్యులర్​​గా డీటాక్స్​ చేసుకోవడం స్కిన్​కేర్​లో చాలా ముఖ్యం. డీటాక్స్​ చేయడం వ్లల మలినాలు, మృత కణాలు, జిడ్డు పోతాయి. చర్మం మెరుస్తుంది. స్కిన్​కేర్​లో ఫేషియల్​ స్టీమింగ్ చేర్చాలి. ఇది ముఖం మీది చర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా స్కిన్​కు పోషణనిస్తుంది. రెగ్యులర్​గా స్టీమింగ్​ చేసుకోవడం వల్ల ముఖం మీద మురికి, బ్యాక్టీరియా, మృత కణాలు చేరకుండా చూసుకోవచ్చు. స్టీమ్​ వల్ల రక్త ప్రసరణ పెరిగి చర్మం హెల్దీగా మారుతుంది. వేడినీళ్లలో ఎసెన్షియల్​ ఆయిల్స్​ కలిపి ఆవిరి పట్టుకుంటే రిజల్ట్​ బాగుంటుంది. హెల్దీ, న్యూట్రియెంట్స్​ ఉన్న డైట్​ రక్తంలోని టాక్సిన్స్​ను తొలగిస్తుంది. జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సీజనల్​ ఫ్రూట్స్​, తాజా ఆకుకూరలు, ఒమెగా–3 ఫ్యాట్స్​ ఉన్న సీడ్స్​, నట్స్​ వంటివి తింటే చర్మం అందంగా కనిపిస్తుంది. వీటితో పాటు ఎక్కువగా నీళ్ళు, లిక్విడ్స్​ తాగితే స్కిన్​ డీటాక్స్​ అవుతుంది. 
సన్​స్క్రీన్​ రాసుకోకుంటే స్కిన్​ దెబ్బతింటుంది. ఎక్కువ టైం ఫోన్​, ల్యాప్​టాప్​, ఇతర గాడ్జెట్స్​ వాడడం వల్ల వాటి నుంచి వచ్చే బ్లూ లైట్​ చర్మానికి హాని చేస్తుంది. అందుకే రోజూ సన్​స్క్రీన్​ రాసుకోవడం మరచిపోవద్దు. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న విటమిన్​–సి  చర్మానికి మ్యాజిక్​లా పనిచేస్తుంది. ఆక్సిడేటివ్​ స్ట్రెస్​ను తగ్గిస్తుంది. చర్మ కణాల​ను రిపేర్​ చేస్తుంది.  విటమిన్– సి ఎక్కువగా దొరికే సిట్రస్​​ ఫ్రూట్స్, మొలకలు​, స్ట్రాబెర్రీలు, క్యాప్సికం​, బొప్పాయి వంటివి డైట్​లో చేర్చుకుంటే స్కిన్​ హెల్దీగా ఉంటుంది.