రైలు ప్రమాదాలకు సాఫ్ట్ వేర్ తో చెక్

రైలు ప్రమాదాలకు సాఫ్ట్ వేర్ తో చెక్
  • వీల్స్ లైడ్ ప్రొటెక్షన్ స్టేటస్,యాక్సిల్ బాక్స్టెంపరేచర్
  • పరిశీలనతో యాక్సిడెంట్లకు చెక్
  • యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రైళ్లప్రమాదాల నివారణకు సౌత్ సెంట్రల్ రైల్వే కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. రన్నింగ్ ‌‌‌‌ట్రైన్లలో ఏవైనా సమస్యలు, లోపాలు తలెత్తితే క్షణాల్లోనే గుర్తించే ఇంటిగ్రేటెడ్‌‌‌‌మా నిటరింగ్‌‌‌‌ సిస్టమ్ తయారు చేసింది. ఇది ప్రమాదాలు జరగక ముందే స్టాఫ్‌కు హెచ్చరికలు జారీ చేస్తుంది.పట్టాలు తప్పడం, టోమెటిక్‌‌‌‌గా బ్రేక్స్ అప్లయ్ అయి మంటలు చెలరేగడం, అగ్ని ప్రమాదాలు, బోగీలువిడిపోవడం లాంటి ప్రమాదాలు జరగకుండా టెక్నాలజీతో ఆపొచ్చని అధికారులు అంటున్నారు.రైళ్లలో బ్రేకులు వేసినప్పుడు పట్టాలపై పట్టును కలిగి ఉండేందుకు ఎల్‌‌‌‌హెచ్‌బీ బోగీలకు వీల్‌‌‌‌స్లై డ్‌‌‌‌ప్రొటెక్ష న్‌ డివైస్‌‌‌‌(డబ్ల్యూఎస్పీడీ)లను అమర్చుతారు. ఇంటిగ్రేటెడ్‌‌‌‌ఆన్‌లైన్‌మానిటరింగ్‌‌‌‌సిస్టమ్ లోని ప్రొటోటైప్‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ డేటా అనలటిక్స్‌‌‌‌ద్వారా డబ్ల్యూఎస్‌‌‌‌పీడీల లో డేటా పాయింట్లను ఆన్‌లైన్‌లో అబ్జర్వ్ చేస్తుంది.యాక్సిల్ బాక్స్ బేరింగ్స్ వేడెక్కితే అవి ఫెయిలై రైలు పట్టాలు తప్పడం లేదా అగ్నిప్రమాదాలు జరిగే చాన్స్ ఉంటుంది. కొత్తసాఫ్ట్ వేర్ ద్వారా యాక్సిల్ బాక్స్ టెంపరేచర్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్‌‌‌‌ ఆన్‌లైన్‌ మానిటరింగ్ ‌‌‌‌సిస్టమ్ ను మొబైల్ యాప్ ద్వారా పరిశీలించే ఫెసిలిటీ ఉంటుంది. ఆగిన లేదా రన్నింగ్‌‌‌‌టైంలో ఎలాంటి అసాధారణ పరిస్థితులు ఏర్పడినాయాప్ ద్వారా స్టాఫ్ ను అలర్ట్ చేస్తుంది. దీని ద్వారా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించే అవకాశం ఉంటుంది.మానిటరింగ్ సిస్టమ్ లో ఏమున్నయ్ ఇంటిగ్రేటెడ్ ఆన్ లైన్ మానిటరింగ్ సిస్టమ్ కు రూ.2 వేల వరకు ఖర్చవుతుంది. దీంట్లో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్(పీసీబీ), మైక్రో కంట్రోలర్, ఎల్డీఆర్ సెన్సార్ లు, టెంపరేచర్ సెన్సార్లు,పవర్ సప్లయ్ తో కూడిన వైఫై రూటర్ ఉంటాయి. రైళ్లలో చిన్న చిన్న లోపాలతో జరిగే ప్రమాదాలను నివారించేందుకు ఈ సిస్టమ్ ను రూపొందించిన తిరుపతి కోచింగ్ డిపో అధికారులను సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానన్ మాల్యా అభినందించారు.