హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలానక్షత్రం ఇవాళే కావడంతో.. దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు.
అధికారులు గర్భగుడిని ఐదువేల పుస్తకాలతో అలంకరించారు. భక్తుల తాకిడి ఉండటంతో.. దర్శనానికి గంటకుపైగా సమయం పడుతోంది. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.
