
బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ‘డెవిల్’. అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న పీరియాడికల్ డ్రామాను నవంబర్ 24న విడుదల చేయనున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అయితే ఆ తేదీకి సినిమా రిలీజ్ కావడం లేదని బుధవారం మూవీ టీమ్ ప్రకటించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, వీఎఫ్‌ఎక్స్ లాంటి టెక్నికల్ కారణాల వలన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామన్నారు. సంయుక్త మీనన్, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాత్రలను పరిచయం చేసిన మేకర్స్, సాంగ్స్, టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచారు.